
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో గుజరాత్ జెయింట్స్ జట్టు విజయపరంపర కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 39–37తో మాజీ చాంపియన్ యు ముంబా జట్టును ఓడించింది. ఈ లీగ్‌లో గుజరాత్‌కిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. రెయిడర్ సోనూ జగ్లాన్ 11 పాయింట్లు స్కోరు చేసి గుజరాత్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
రాకేశ్ (9 పాయింట్లు), రోహిత్ గులియా (7 పాయింట్లు) కూడా రాణించారు. యు ముంబా తరఫున గుమన్ సింగ్, అమీర్ మొహమ్మద్ పది పాయింట్ల చొప్పున స్కోరు చేసినా కీలకదశలో గుజరాత్ జెయింట్స్ ఆటగాళ్లు పైచేయి సాధించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్‌తో పట్నా పైరేట్స్; యూపీ యోధాస్‌తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment