
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో మాజీ చాంపియన్ యు ముంబా ‘హ్యాట్రిక్’ విజయం ఖాతాలో వేసుకుంది. నోయిడా వేదికగా జరుగుతున్న రెండో అంచె పోటీల్లో ఆదివారం యు ముంబా జట్టు ఉత్కంఠ పోరులో 35–33తో యూపీ యోధాస్‌పై గెలిచింది.
యు ముంబా తరఫున అజిత్ చవాన్, రోహిత్ రాఘవ్ చెరో 8 పాయింట్లతో రాణించగా... యూపీ యోధాస్ తరఫున భరత్ హుడా 11 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. ఆరంభంలో ఆకట్టుకున్న యూపీ జట్టు ప్రత్యర్థిపై పైచేయి కనబర్చినా దాన్ని చివరి వరకు కొనసాగించలేక పోయింది.
ఇక తాజా సీజన్‌లో యు ముంబా 8 మ్యాచ్‌లాడి 5 విజయాలు, 2 పరాజయాలు, ఒక ‘టై’తో 29 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరింది. మరోవైపు.. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదో పరాజయం మూటగట్టుకున్న యూపీ యోధాస్ 20 పాయింట్లతో పదో స్థానంలో ఉంది.
గుజరాత్ జెయింట్స్ ఓటమి
మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 39–23 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించింది. హరియాణా స్టీలర్స్ తరఫున రాహుల్ 8 పాయింట్లు... వినయ్, రెజా చెరో 7 పాయింట్లతో సత్తాచాటారు. గుజరాత్ జెయింట్స్ తరఫున రాకేశ్ (7 పాయింట్లు) మినహా మిగతా వారు ఆకట్టుకోలేకపోయారు. హరియాణా 26 పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానానికి ఎగబాకింది.
మరోవైపు... గుజరాత్ జెయింట్స్ 7 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ జెయింట్స్‌తో పట్నా పైరేట్స్ (రాత్రి 8 గంటలకు), యు ముంబాతో హరియాణా స్టీలర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. ఇక ఇప్పటి వరకు పుణెరి పల్టన్ అస్థానంలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment