యు ముంబా విజయం | U Mumba Beat Haryana Steelers 33-39 | Sakshi
Sakshi News home page

యు ముంబా విజయం

Published Fri, Oct 11 2019 6:04 AM | Last Updated on Fri, Oct 11 2019 6:04 AM

 U Mumba Beat Haryana Steelers 33-39 - Sakshi

గ్రేటర్‌ నోయిడా: తన అద్భుతమైన ట్యాక్లింగ్‌తో ప్రత్యర్థిని పట్టేసిన యు ముంబా సారథి ఫజల్‌ అత్రాచలి జట్టుకు విజయాన్ని అందించాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 39–33తో హరియాణా స్టీలర్స్‌పై గెలుపొందింది. ట్యాక్లింగ్‌లో మెరిసిన అత్రాచలి 8 పాయింట్లతో అదరగొట్టాడు. అతనికి రైడర్‌ అజింక్యా కప్రె (9 పాయింట్లు) చక్కటి సహకారం అందించాడు. హరియాణా రైడర్‌ వినయ్‌ 11 పాయింట్లతో టాప్‌ స్కోరర్‌గా నిలిచినా జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో దబంగ్‌ ఢిల్లీ; యూపీ యోధతో బెంగళూరు బుల్స్‌ తలపడతాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement