యు ముంబా హ్యాట్రిక్‌ | u Mumba hat trick wins | Sakshi
Sakshi News home page

యు ముంబా హ్యాట్రిక్‌

Published Thu, Sep 7 2017 12:52 AM | Last Updated on Tue, Sep 12 2017 2:04 AM

u Mumba hat trick wins

కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్‌లో మాజీ చాంపియన్‌ యు ముంబా హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. బెంగాల్‌ వారియర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 37–31తో గెలిచింది. ముంబా తరఫున అనూప్‌ కుమార్‌ 11 పాయింట్లు, శ్రీకాంత్‌ జాదవ్, కాశిలింగ్‌ అడకె ఎనిమిదేసి పాయింట్లు సాధించి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ 38–30తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. దబంగ్‌ ఢిల్లీ కెప్టెన్‌ మేరాజ్‌ షేక్‌ 14 పాయింట్లు సాధించడం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement