
ముంబై : ప్రపంచకప్ ముగియడంతో క్రీడా అభిమానులను అలరించడానికి ప్రొ కబడ్డీ సీజన్-7 సిద్ధమైంది. జులై 20న హైదరాబాద్ వేదికగా ఈ మెగాఈవెంట్ ప్రారంభంకానుంది. ఇప్పటికే కావాల్సిన ఆటగాళ్లను దక్కించుకున్న ఆయా ఫ్రాంచైజీలు.. టైటిల్ లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. యుముంబా తమ జట్టు సారథిగా ఫజల్ అట్రాచలీ(ఇరాన్)ని కొనసాగిస్తూ.. వైస్ కెప్టెన్‌గా సందీప్ నర్వాల్‌ను ప్రకటించింది. యు ముంబా కబడ్డీ జట్టు సారథ్య బాధ్యతలు మరోసారి అప్పగించడం సంతోషంగా ఉందని, జట్టును విజయం దిశగా తీసుకెళ్తానని ఫజల్ అట్రాచలీ మీడియా సమావేశంలో తెలిపాడు. వ్యూహాలు, క్రమశిక్షణ చాలా ముఖ్యమని, ఆటగాళ్లు తమ అద్భుత ప్రదర్శనివ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నాడు. వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై సంతోషం వ్యక్తం చేసిన సందీప్ నర్వాల్.. వ్యూహాలు రచించడం ఆటలో కీలకమని అభిప్రాయపడ్డాడు. వైస్ కెప్టెన్‌గా వ్యూహాలు రచించడంలో ముందుంటానని, ఆదిశగా సాధన చేస్తానని తెలిపాడు. ఇక యుముంబా జులై 20న హైదరాబాద్ వేదికగా తెలుగు టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌తో తన క్యాంపైన్ ప్రారంభించనుంది.
పుణెరి పల్టాన్ కెప్టెన్‌గా సుర్జీత్ సింగ్
పుణెరి పల్టాన్ తన కెప్టెన్‌గా సుర్జీత్ సింగ్‌ను ప్రకటించింది. జట్టును నడిపించే సత్తా సుర్జీత్‌కు ఉందని కోచ్ అనూప్ కుమార్ ధీమా వ్యక్తం చేశాడు. నితిన్ తోమర్‌చ గిరిష్ ఎర్నాక్, పవన్ కుమార్, దర్శన్ కడియన్‌లతో పుణెరి పల్టాన్ పటిష్టంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment