
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7లో యు ముంబా శుభారంభం చేసింది. సొంత మైదానంలో జరుగుతున్న సీజన్ ఆరంభపు మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ చేతులెత్తేసింది. శనివారం హైదరాబాద్ వేదికగా తెలుగు టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 31-25 తేడాతో యు ముంబా ఘనవిజయం సాధించింది. ముంబై ఆటగాడు అభిషేక్ సింగ్ పది రైడింగ్ పాయింట్లతో చెలరేగగా.. డిఫెండర్స్ రోహిత్ బలియాన్, సందీప్ నర్వాల్ తలో నాలుగు ట్యాకిల్ పాయింట్లతో టైటాన్స్ ఓటమిలో కీలక పాత్ర పోషించారు. టైటాన్స్ ఆటగాళ్లలో రజ్నిష్ 8 రైడింగ్ పాయింట్లతో ఆకట్టుకున్నప్పటికీ మిగతా వారి నుంచి సహకారం అందలేదు. సారథి అబోజర్ నాలుగు సార్లు ట్యాకిల్‌లో విఫలమవడం టైటాన్స్‌ను తీవ్రంగా దెబ్బతీసింది.
Comments
Please login to add a commentAdd a comment