
పంచకుల: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–7)లో తాజాగా యు ముంబా ప్లే ఆఫ్స్‌కు చేరింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో మాజీ చాంపియన్ ముంబా జట్టు 30–26తో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. యు ముంబా జట్టులో అభిషేక్ సింగ్ (7), అతుల్ (5), రోహిత్ బలియన్ (5), ఫజల్ అత్రాచలి (4) రాణించారు. పట్నా పైరేట్స్ తరఫున ప్రదీప్ నర్వాల్ (8) పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 59–36తో హరియాణా స్టీలర్స్‌పై భారీ విజయం సాధించింది. బెంగళూరు తరఫున పవన్ షెరావత్ ఒక్కడే రికార్డు స్థాయిలో 39 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే పోరులో తెలుగు టైటాన్స్‌తో పుణేరి పల్టన్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment