
ప్రొ వాలీబాల్ లీగ్‌లో ఎట్టకేలకు బోణీ కొట్టిన యు ముంబా వాలీ జట్టు సెమీస్ ఆశల్ని సజీవంగా నిలబెట్టుకుంది. శనివారం చెన్నై స్పార్టన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 15–14, 15–8, 15–10, 10–15, 10–15తో నెగ్గింది. యు ముంబా కెప్టెన్ దీపేశ్ సిన్హా (11 పాయింట్లు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
అతను 5 స్పైక్, 2 బ్లాక్, మరో 4 సర్వీస్ పాయింట్లు సాధించాడు. నాలుగు మ్యాచ్‌లాడిన యు ముంబాకిది తొలి గెలుపు కాగా... చెన్నై కూడా నాలుగు మ్యాచ్‌లాడి ఒకటే గెలిచింది. నేడు చెన్నై స్పార్టన్స్‌తో అహ్మదాబాద్ డిఫెండర్స్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment