
కోల్‌కతా: ఉత్కంఠ పోరులో యూపీ యోధాను విజయం వరించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధా 34–32తో యు ముంబాపై గెలుపొందింది. ఇరుజట్లు పాయింట్ల కోసం పోటీ పడటంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి యూపీ యోధా 20–15తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత విజృంభించిన యు ముంబా 20–20తో స్కోర్లు సమం చేసినా... చివరకు ఆధిక్యం కనబరిచిన యోధా విజయం సాధించింది.
యు ముంబా తరఫున రోహిత్ 10, అబోఫజల్ 5 పాయింట్లు సాధించారు. యోధా తరఫున ప్రశాంత్ 8, రిషాంక్, సచిన్ చెరో 7 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 39–23తో పట్నా పైరేట్స్‌పై గెలిచింది. నేటి మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌తో దబంగ్ ఢిల్లీ తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment