
ప్రో కబడ్డీ-2023 సీజన్‌ను ఓటమితో తెలుగు టైటాన్స్ ప్రారంభించింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ జైంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 38-32 పాయింట్ల తేడాతో టైటాన్స్ పరాజయం పాలైంది. ఫస్ట్‌హాఫ్‌లో తెలుగు టైటాన్స్ అధిక్యం కనబరచగా.. సెకెండ్ హాఫ్‌లో గుజరాత్ అనూహ్యంగా పుంజుకుని తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.
గుజరాత్ రైడర్ సోను జగ్లాన్ 5 పాయింట్ల రైడ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. గుజరాత్ రైడర్లలో సోనూతో పాటు రాకేష్ 5 పాయింట్లు, రోహిత్ గులియా 4 పాయింట్లు సాధించారు. తెలుగు టైటాన్స్‌లో పవన్ సెహ్రావత్ ఆరు, రజనీష్ దలాల్ నాలుగు పాయింట్లు చేశారు.
చదవండి: IND vs SA: 'నిజంగా సిగ్గు చేటు'.. భారత్-సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌పై డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment