
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన తెలుగు టైటాన్స్ జట్టుతో బీకే టైర్స్ సంస్థ జతకట్టింది. ఈసీజన్‌కు గానూ తెలుగు టైటాన్స్‌కు అధికారిక భాగస్వామిగా వ్యవహరించనుంది. ఇకనుంచి టైటాన్స్‌కు సంబంధించిన జెర్సీలు, కిట్లపై బీకే టైర్స్ లోగో కనిపించనుంది. ఈ ఒప్పందంతో బీకే టైర్స్ భాగస్వామ్యం ప్రొ కబడ్డీ లీగ్‌లో ఏడు జట్లకు చేరింది. ఎంతో ప్రేక్షకాదరణ పొందిన విజయవంతమైన టైటాన్స్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని బీకే టైర్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ పొద్దార్ అన్నారు. ఈ భాగస్వామ్యంపై తెలుగు టైటాన్స్ సీఈవో మండ పవన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment