Pro Kabaddi Season 8: Starting On December 22nd In Bangalore - Sakshi
Sakshi News home page

Pro Kabaddi Season 8: ఈనెల 22 నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌  

Published Thu, Dec 2 2021 7:36 AM | Last Updated on Thu, Dec 2 2021 12:17 PM

PRO Kabaddi League Season 8 Start From December 22nd Bangalore - Sakshi

బెంగళూరు: కబడ్డీ కూతకు రంగం సిద్ధమైంది. ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఈ నెల 22 నుంచి బెంగళూరులో జరగనుంది. ఎనిమిదో సీజన్‌ మొత్తానికి ఇదే నగరం వేదిక కానుండటం మరో విశేషం. కరోనా కొత్త వేరియంట్ల కలకలం, ఈ ఏడాది ఐపీఎల్‌ అనుభవాల దృష్ట్యా మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. డిసెంబర్‌ 22న తొలి మ్యాచ్‌లో  యు ముంబాతో బెంగళూరు బుల్స్‌ తలపడనుంది. అదే రోజు తెలుగు టైటాన్స్‌తో తమిళ్‌ తలైవాస్, డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగాల్‌ వారియర్స్‌తో యూపీ యోధ పోటీ పడతాయి. కరోనా మహమ్మారి పడగ విప్పటంతో గతేడాది ప్రొ కబడ్డీ లీగ్‌ రద్దయింది.

చదవండి: Ind Vs SA 2021- Virat Kohli: వారం రోజుల్లో తేలననున్న కోహ్లి భవితవ్యం.. కొనసాగిస్తారా? లేదంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement