
Pro Kabaddi League 2023: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో తెలుగు టైటాన్స్ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. శుక్రవారం జరిగిన తమ ఆరో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 37–36తో హరియాణా స్టీలర్స్ జట్టుపై నెగ్గింది. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ అత్యధికంగా 10 పాయింట్లు, అజిత్ పవార్ 7 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 46–33తో తమిళ్ తలైవాస్‌ను ఓడించింది.
When you play for the Steelers, you always 𝐒𝐓𝐄𝐀𝐋 points 😉🔥#ProKabaddiLeague #ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #HSvTT #HaryanaSteelers #TeluguTitans pic.twitter.com/Es9C6C7ZYx
— ProKabaddi (@ProKabaddi) December 22, 2023
టాప్‌లో పుణెరి పల్టన్.. టైటాన్స్ చివర
ఇక పీకేఎల్-2023 సీజన్‌లో ఇప్పటి వరకు పుణెరి పల్టన్ ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదు గెలిచి 26 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు... బెంగాల్ వారియర్స్ ఆరింట మూడు(21 పాయింట్లు), హరియాణా స్టీలర్స్ ఆరింట నాలుగు(21 పాయింట్లు), జైపూర్ పింక్ పాంథర్స్ ఆరింట మూడు (20 పాయింట్లు) గెలిచి టాప్-4లో స్థానం సంపాదించాయి. మరోవైపు.. తెలుగు టైటాన్స్ ఆరింట ఐదు ఓడగా.. తాజా విజయంతో ఏడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అయితే, ఇప్పటికీ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలోనే ఉంది.
చదవండి: విండీస్‌దే టి20 సిరీస్
తరూబా (ట్రినిడాడ్): సొంతగడ్డపై వెస్టిండీస్ జట్టు వన్డే, టి20ల్లో ఇంగ్లండ్‌పై పైచేయి సాధించింది. ఇంతకుముందే వన్డే సిరీస్‌ను గెలుచున్న విండీస్ ఇప్పుడు టి20 సిరీస్‌నూ 3–2తో తమ ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన చివరిదైన ఐదో టి20 మ్యాచ్‌లో రోవ్‌మన్ పావెల్ కెప్టెన్సీలోని వెస్టిండీస్ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.
ముందుగా ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. ఫిల్ సాల్ట్ (22 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గుడకేశ్ మోతీ (3/24) ఇంగ్లండ్‌ను కట్టడి చేశాడు. అనంతరం విండీస్ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 133 పరుగులు సాధించింది. షై హోప్ (43 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.