
సోనెపట్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ వరుసగా రెండో విజయం సాధించింది. శనివారం జోన్ ‘బి’లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (9 పాయింట్లు), నీలేశ్ సోలంకి (5 పాయింట్లు) చెలరేగడంతో తెలుగు టైటాన్స్ 34–29 తో యూపీ యోధాపై గెలిచింది. ట్యాక్లింగ్‌లో అబోజర్ (6 పాయింట్లు) ఆకట్టుకున్నాడు.
యూపీ యోధా తరఫున ప్రశాం త్ 11, రిషాంక్ 7 పాయింట్లు సాధించా రు. జోన్ ‘ఎ’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో యు ముంబా 53–26తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచింది. యు ముంబా తరఫున అభిషేక్ సింగ్ 12 రైడ్ పాయింట్లు సాధించగా... హరియాణా తరఫున వికాస్ 9 రైడ్ పాయింట్లు సాధించాడు. నేడు పట్నా పైరేట్స్‌తో యూపీ యోధా, హరియాణా స్టీలర్స్‌తో పుణేరీ పల్టన్ జట్లు తలపడనున్నాయి
Comments
Please login to add a commentAdd a comment