పట్నాకు తెలుగు టైటాన్స్ షాక్ | Patna teamsTelugu Titans shock | Sakshi
Sakshi News home page

పట్నాకు తెలుగు టైటాన్స్ షాక్

Published Mon, Feb 29 2016 12:59 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

పట్నాకు తెలుగు టైటాన్స్ షాక్

పట్నాకు తెలుగు టైటాన్స్ షాక్

 
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ తాజా సీజన్‌లో అగ్రస్థానంలో దూసుకెళుతున్న పట్నా పైరేట్స్‌కు తెలుగు టైటాన్స్ షాకిచ్చింది. దీంతోపాటు తమ సెమీస్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. ఆదివారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో టైటాన్స్ 42-41 తేడాతో పట్నాపై నెగ్గింది. ఇప్పటికే సెమీస్‌కు చేరిన పట్నా జట్టుకు ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఇది కేవలం రెండో ఓటమి కావడం గమనార్హం. చివరి ఐదు నిమిషాల్లో ఆధిక్యం ఇరు జట్ల మధ్య దోబూచులాడినా చివరకు టైటాన్స్ గట్టెక్కింది. రాహుల్ చౌదరి 14 రైడ్ పాయింట్లతో అదరగొట్టాడు. పట్నా నుంచి ప్రదీప్ నర్వాల్ ఏకంగా 24 పాయింట్లతో దుమ్ము రేపినా ఫలితం లేకపోయింది.

అయితే ప్రస్తుతం 38 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న టైటాన్స్ సెమీస్ చేరాలంటే పుణే (42), బెంగాల్ (42) జట్లు తమ రెండేసి మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడాల్సి ఉంటుంది. మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబా 35-21 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించి సెమీస్‌కు చేరింది. ఇది ఈ జట్టుకు వరుసగా ఏడో విజయం కావడం విశేషం. మొత్తంగా ఆడిన 11 మ్యాచ్‌ల్లో తొమ్మిది విజయాలతో ముంబా 45 పాయింట్లతో ద్వితీయ స్థానంలో ఉంది. మరోవైపు ఆరో స్థానంలో నిలిచిన జైపూర్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement