టైటాన్స్‌కు మరో టై | Another tie to telugu Titans | Sakshi
Sakshi News home page

టైటాన్స్‌కు మరో టై

Jul 22 2016 12:46 AM | Updated on Sep 4 2017 5:41 AM

ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కు మరో టై ఎదురైంది. గురువారం యు ముంబాతో జరిగిన మ్యాచ్ 25-25తో ముగిసింది.

ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కు మరో టై ఎదురైంది. గురువారం యు ముంబాతో జరిగిన మ్యాచ్ 25-25తో ముగిసింది. తమ చివరి మూడు మ్యాచ్‌ల్లో టైటాన్స్‌కు ఇది రెండో టై. కెప్టెన్ రాహుల్ చౌదరి 8 రైడింగ్, సందీప్ నర్వాల్ మూడు రైడింగ్, మూడు ట్యాకిల్ పాయింట్లతో ఆకట్టుకున్నారు.  సొంతగడ్డపై జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబా ఆరంభం నుంచే ఆధిక్యం చూపింది. దీంతో ప్రథమార్ధం 15-7తో ముగించింది. అయితే రాహుల్ రైడింగ్ ద్వారా చకచకా పాయింట్లు సాధించిన టైటాన్స్ 31వ నిమిషంలో 18-17తో మ్యాచ్‌లో తొలిసారిగా ఆధిక్యం చూపింది.


39వ నిమిషం వరకు టైటాన్స్ ఆధిక్యంలో ఉన్నా... చివరకు టైతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 24-22 తేడాతో దబాంగ్ ఢిల్లీ కేసీని ఓడించి తిరిగి పట్టికలో టాప్‌కు చేరింది.  నేడు జరిగే మ్యాచ్‌లలో జైపూర్‌తో పట్నా, యు ముంబాతో బెంగాల్ తలపడతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement