Rahul Chowdhary
-
టెటాన్స్కు తలైవాస్ దెబ్బ
అహ్మదాబాద్: రైడింగ్‌లో రాహుల్ చౌదరి (8 పాయింట్లు) విజృంభించినా... రక్షణ శ్రేణి లోపాలతో ప్రొ కబడ్డీ లీగ్ చరిత్రలో తొలిసారిగా తమిళ్ తలైవాస్ చేతిలో తెలుగు టైటాన్స్ పరాజయం పాలైంది. ఆరో సీజన్లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో తలైవాస్ 27–23 తేడాతో టైటాన్స్‌ను ఓడించింది. ఆ జట్టు తరఫున రైడింగ్‌లో అజయ్ ఠాకూర్ (8 పాయింట్లు), ట్యాక్లింగ్‌లో మన్జీత్ చిల్లర్ (3 పాయింట్లు) మెరిశారు. ఐదో నిమిషంలో ఇరు జట్లు 4–4తో సమంగా ఉన్నా, అద్భుత ట్యాక్లింగ్‌తో 4 పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి వెళ్లారు. తొలి భాగం ముగిసేసరికి తలైవాస్ 13–6తో నిలిచింది. రెండో భాగంలో పుంజుకొన్న టైటాన్స్... ప్రత్యర్థి స్కోరును అందుకునేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 29–26తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో పట్నా పైరేట్స్, యు ముంబాతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ ఆడతాయి. -
రాహుల్... జిగేల్
పట్నా: స్టార్ రైడర్ రాహుల్ చౌదరి చెలరేగడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ నాలుగో విజయం సాధించింది. జోన్ ‘బి’లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 53–32తో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది. రైడింగ్‌లో రాహుల్ 17, నీలేశ్ 7 పాయింట్లతో సత్తా చాటడంతో పాటు ట్యాక్లింగ్‌లో విశాల్ (9 పాయింట్లు) రాణించడంతో టైటాన్స్ సునాయాసంగా గెలుపొందింది. 11వ నిమిషంలో 8–9తో వెనుకబడి ఉన్న టైటాన్స్... నీలేశ్ ‘సూపర్‌రైడ్’తో 3 పాయింట్లు సాధించడంతో 11–9తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా చెలరేగి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. పట్నా తరఫున వికాస్ 9 రైడ్ పాయింట్లు సాధించగా... ‘డుబ్కీ’ కింగ్ ప్రదీప్ (4 పాయింట్లు) విఫలమయ్యాడు. మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 37–27తో పుణేరీ పల్టన్స్‌పై నెగ్గింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో పుణేరీ పల్టన్, పట్నా పైరేట్స్‌తో బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి. -
తెలుగు టైటాన్స్ రెండో విజయం
సోనెపట్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ వరుసగా రెండో విజయం సాధించింది. శనివారం జోన్ ‘బి’లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో స్టార్ రైడర్ రాహుల్ చౌదరి (9 పాయింట్లు), నీలేశ్ సోలంకి (5 పాయింట్లు) చెలరేగడంతో తెలుగు టైటాన్స్ 34–29 తో యూపీ యోధాపై గెలిచింది. ట్యాక్లింగ్‌లో అబోజర్ (6 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. యూపీ యోధా తరఫున ప్రశాం త్ 11, రిషాంక్ 7 పాయింట్లు సాధించా రు. జోన్ ‘ఎ’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో యు ముంబా 53–26తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచింది. యు ముంబా తరఫున అభిషేక్ సింగ్ 12 రైడ్ పాయింట్లు సాధించగా... హరియాణా తరఫున వికాస్ 9 రైడ్ పాయింట్లు సాధించాడు. నేడు పట్నా పైరేట్స్‌తో యూపీ యోధా, హరియాణా స్టీలర్స్‌తో పుణేరీ పల్టన్ జట్లు తలపడనున్నాయి -
ఆసియా క్రీడల్లో కబడ్డీ జట్టుకు ఊహించని షాక్
-
ఏషియన్ గేమ్స్ చరిత్రలో తొలిసారి..
జకర్తా: ప్రపంచ కబడ్డీ చాంపియన్ భారత్‌కు ఆసియా క్రీడల్లో ఊహించని షాక్ తగిలింది. ఏషియన్ గేమ్స్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫైనల్ చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. సెమీఫైనల్లో భాగంగా గురువారం బలమైన ఇరాన్ చేతిలో 18-27 తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. ఆట ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన ఇరాన్ ఆటగాళ్లు.. బలమైన డిఫెన్స్‌తో అజయ్ ఠాకూర్‌సేనకు పాయింట్లు చిక్కకుండా అడ్డుకున్నారు. బలమైన డిఫెండింగ్ గల ఇరాన్ సూపర్ ట్యాకిల్ పాయింట్లతో విరుచుకపడింది. దీంతో ఆత్మరక్షణలో పడిన భారత ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టుకు తలవంచారు. టీమిండియా సారథి అజయ్ ఠాకూర్, ప్రో కబడ్డీ లీగ్ స్టార్ రైడర్లు ప్రదీప్ నర్వాల్, రాహుల్ చౌదరీ, రిషాంక్ దేవడిగా, మోనూ గోయత్‌లు ఇరాన్ డిఫెండింగ్ ముందు తేలిపోయారు.భారత రైడర్లు పాయింట్లు తేవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇక డిఫెండింగ్‌లోనూ భారత ఆటగాళ్లు అంతగా రాణించలేకపోయారు. తొలుత డిఫెండర్ గిరీష్ మారుతి ఎర్నాక్ రాణించినా చివర్లో విఫలమయ్యారు. మోహిత్ చిల్లర్, దీపక్ నివాస్ హుడా, సందీప్ నర్వాల్‌లు కూడా చేతులెత్తాశారు. భారత ఆటగాళ్లు సమిష్టిగా విఫలమవ్వడంతో ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుస్తుందనుకున్న జట్టు తొలి సారి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇక మరోవైపు భారత మహిళల కబడ్డీ జట్టు ఆసియా క్రీడల్లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత మహిళల జట్టు 27-14తేడాతో చైనీస్ తైపీ జట్టును చిత్తు చేసి కనీసం రజతం ఖాయం చేశారు. -
టైటాన్స్‌కు మరో టై
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కు మరో టై ఎదురైంది. గురువారం యు ముంబాతో జరిగిన మ్యాచ్ 25-25తో ముగిసింది. తమ చివరి మూడు మ్యాచ్‌ల్లో టైటాన్స్‌కు ఇది రెండో టై. కెప్టెన్ రాహుల్ చౌదరి 8 రైడింగ్, సందీప్ నర్వాల్ మూడు రైడింగ్, మూడు ట్యాకిల్ పాయింట్లతో ఆకట్టుకున్నారు. సొంతగడ్డపై జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబా ఆరంభం నుంచే ఆధిక్యం చూపింది. దీంతో ప్రథమార్ధం 15-7తో ముగించింది. అయితే రాహుల్ రైడింగ్ ద్వారా చకచకా పాయింట్లు సాధించిన టైటాన్స్ 31వ నిమిషంలో 18-17తో మ్యాచ్‌లో తొలిసారిగా ఆధిక్యం చూపింది. 39వ నిమిషం వరకు టైటాన్స్ ఆధిక్యంలో ఉన్నా... చివరకు టైతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 24-22 తేడాతో దబాంగ్ ఢిల్లీ కేసీని ఓడించి తిరిగి పట్టికలో టాప్కు చేరింది. నేడు జరిగే మ్యాచ్‌లలో జైపూర్‌తో పట్నా, యు ముంబాతో బెంగాల్ తలపడతాయి. -
పట్నాకు తెలుగు టైటాన్స్ షాక్
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ తాజా సీజన్లో అగ్రస్థానంలో దూసుకెళుతున్న పట్నా పైరేట్స్‌కు తెలుగు టైటాన్స్ షాకిచ్చింది. దీంతోపాటు తమ సెమీస్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. ఆదివారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో టైటాన్స్ 42-41 తేడాతో పట్నాపై నెగ్గింది. ఇప్పటికే సెమీస్‌కు చేరిన పట్నా జట్టుకు ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఇది కేవలం రెండో ఓటమి కావడం గమనార్హం. చివరి ఐదు నిమిషాల్లో ఆధిక్యం ఇరు జట్ల మధ్య దోబూచులాడినా చివరకు టైటాన్స్ గట్టెక్కింది. రాహుల్ చౌదరి 14 రైడ్ పాయింట్లతో అదరగొట్టాడు. పట్నా నుంచి ప్రదీప్ నర్వాల్ ఏకంగా 24 పాయింట్లతో దుమ్ము రేపినా ఫలితం లేకపోయింది. అయితే ప్రస్తుతం 38 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న టైటాన్స్ సెమీస్ చేరాలంటే పుణే (42), బెంగాల్ (42) జట్లు తమ రెండేసి మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడాల్సి ఉంటుంది. మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబా 35-21 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించి సెమీస్‌కు చేరింది. ఇది ఈ జట్టుకు వరుసగా ఏడో విజయం కావడం విశేషం. మొత్తంగా ఆడిన 11 మ్యాచ్‌ల్లో తొమ్మిది విజయాలతో ముంబా 45 పాయింట్లతో ద్వితీయ స్థానంలో ఉంది. మరోవైపు ఆరో స్థానంలో నిలిచిన జైపూర్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది.