
గ్రేటర్ నోయిడా: ఇప్పటికే డజను ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న తెలుగు టైటాన్స్... తాజాగా మరో ఓటమితో ఆ స్థానాన్ని మెరుగు పరుచుకునే అవకాశాన్ని కూడా కోల్పోయింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 38–48తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చేతిలో చిత్తయింది. సిద్దార్థ్ దేశాయ్ 13 పాయింట్ల ప్రదర్శన ప్రత్యర్థి రైడర్లు సోను (17 పాయింట్లు), రోహిత్ గులియా (9 పాయింట్లు) ముందు చిన్నదైంది. టైటాన్స్‌కు సీజన్‌లో ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండగా... దానిని గెలిచి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఉన్న స్థానాన్ని కాపాడుకుంటుందో లేక చిట్ట చివరి స్థానానికి పడిపోతుందో చూడాలి.
మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 35–33తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై నెగ్గింది. అజిత్‌కుమార్ సూపర్‘టెన్’తో జట్టుకు విజయాన్ని అందించాడు నేడు ప్రొ కబడ్డీ లీగ్‌లో విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో తమిళ్ తలైవాస్; యూపీ యోధతో తెలుగు టైటాన్స్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment