
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు ఖాతాలో 16వ పరాజయం చేరింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 28–35తో పుణేరి పల్టన్ చేతిలో ఓటమి చవిచూసింది. టైటాన్స్ తరఫున ఆదర్శ్ తొమ్మిది పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ 15 పాయింట్లతో 12వ ర్యాంక్‌లో ఉంది.