
సాక్షి, విశాఖపట్నం: సొంత ప్రేక్షకుల మధ్య రెండు వరుస విజయాల తర్వాత తెలుగు టైటాన్స్ ఓటమి పాలైంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 20–27తో యూపీ యోధా చేతిలో ఓడింది. రాహుల్ చౌదరి, అబోజర్ చెరో 6 పాయింట్లు సాధించారు.
యూపీ యోధా తరఫున ప్రశాంత్ 8, నితేశ్ 5 పాయింట్లు చేశారు. మరో మ్యాచ్‌లో యు ముంబా 44–19తో దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది. నేటి మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్, పట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్ ఆడతాయి.
Comments
Please login to add a commentAdd a comment