
పట్నా చేతిలో టైటాన్స్ ఓటమి
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. శుక్రవారం తమిళ్ తలైవాస్‌పై నెగ్గిన తెలుగు టైటాన్స్ అదే జోరును రెండో మ్యాచ్‌లో పునరావృతం చేయలేకపోయింది. డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్‌తో జరిగిన జోన్ ‘బి’ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 29–35తో ఓడిపోయింది.
పైరేట్స్ సారథి పర్దీప్ నర్వాల్ (15 పాయింట్లు) అద్భుతంగా రాణించాడు. సొంత ప్రేక్షకుల మద్దతుతో బరిలోకి దిగిన తెలుగు టైటాన్స్ ... ప్రత్యర్థి జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయింది. రాహుల్ చౌదరీ 7 పాయింట్లు సాధించగా, నీలేశ్ 6, వికాస్, విశాల్ చెరో ఐదు పాయింట్లు చేశారు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ జట్టు 30–26తో జైపూర్ పింక్‌పాంథర్స్‌పై గెలిచింది. ఆదివారం జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో హర్యానా స్టీలర్స్, బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడనున్నాయి.