
వరుసగా ఐదో ఓటమి
ప్రొ కబడ్డీ లీగ్‌లో సొంత వేదికపై జరిగిన చివరి మ్యాచ్‌లోనూ తెలుగు టైటాన్స్ ఆటతీరు మారలేదు.
పట్నా పైరేట్స్ చేతిలో టైటాన్స్ చిత్తు
ప్రొ కబడ్డీ లీగ్
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో సొంత వేదికపై జరిగిన చివరి మ్యాచ్‌లోనూ తెలుగు టైటాన్స్ ఆటతీరు మారలేదు. గురువారం డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36–43 తేడాతో టైటాన్స్ ఘోరంగా ఓడింది. ఇది ఈ జట్టుకు వరుసగా ఐదో పరాజయం కావడం గమనార్హం.
ఇక్కడ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో తొలి మ్యాచ్ మినహా అన్నింట్లోనూ ఓడి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. రాహుల్ చౌదరి 10 రైడ్ పాయింట్లు సాధించగా, పట్నా నుంచి పర్దీప్ నర్వాల్ 12 పాయింట్లతో చెలరేగాడు. నేటి (శుక్రవారం) నుంచి 10 వరకు నాగ్‌పూర్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి.