![Pro Kabaddi 2022: Telugu Titans Lose 8th Game In a Row - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/18/Untitled-4_0.jpg.webp?itok=bVDqsh_t)
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ జట్టు ఇంకా గెలుపు బోణీ కొట్టలేదు. బెంగాల్ వారియర్స్ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 27–28తో ఓటమి చవిచూసింది. ఈ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కిది ఎనిమిదో పరాజయం కావడం గమనార్హం. ఇప్పటివరకు మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ రెండు మ్యాచ్‌లను ‘టై’ చేసుకుంది.
12 పాయింట్లతో టైటాన్స్ జట్టు 12 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో చిట్టచివరి స్థానంలో ఉంది. బెంగళూరుతో మ్యాచ్ లో ఆరంభంలో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న టైటాన్స్ చివర్లో తడబడి మూల్యం చెల్లించుకుంది. టైటాన్స్ తరఫున రెయిడర్ రజనీశ్ 11 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 50–40తో పుణేరి పల్టన్ జట్టుపై ఘనవిజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment