నేటి నుంచి హైదరాబాద్‌లో ప్రొ కబడ్డీ లీగ్‌ | Pro Kabaddi League in Hyderabad from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి హైదరాబాద్‌లో ప్రొ కబడ్డీ లీగ్‌

Published Fri, Oct 18 2024 3:38 AM | Last Updated on Fri, Oct 18 2024 3:38 AM

Pro Kabaddi League in Hyderabad from today

ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌కు నగారా మోగింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో నేడు ఈ టోర్నీ ప్రారంభమవుతుంది. మొత్తం 12 జట్లు బరిలో ఉన్నాయి. డిసెంబర్‌ 24 వరకు సాగే లీగ్‌ దశలో 132 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. హైదరాబాద్‌తో పాటు నోయిడా, పుణే ఇతర వేదికలుగా ఉన్నాయి. 

నేడు జరిగే రెండు మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్‌తో బెంగళూరు బుల్స్‌; ఢిల్లీ దబంగ్‌తో యు ముంబా ఆడతాయి. గురువారం జరిగిన ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో అన్ని జట్ల కెపె్టన్లు పాల్గొన్నారు.  స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్‌లు చూడాలనుకునే కబడ్డీ అభిమానులు bౌౌజుఝyటజిౌఠీ ద్వారా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. 

రూ.500, రూ.1000, రూ. 2500లకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌ అంచె మ్యాచ్‌లు నవంబర్‌ 9వ తేదీన ముగుస్తాయి. ఆ తర్వాత నవంబర్‌ 10 నుంచి డిసెంబర్‌ 1 వరకు నోయిడాలో... డిసెంబర్‌ 3 నుంచి 24 వరకు పుణేలో మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్‌ దశ ముగిశాక టాప్‌–6లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement