
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 18–54 పాయింట్ల తేడాతో పుణేరి పల్టన్ చేతిలో భారీ ఓటమి చవిచూసింది. ఈ లీగ్‌లో టైటాన్స్ జట్టుకిది ఎనిమిదో పరాజయం కావడం గమనార్హం. టైటాన్స్ జట్టు కెపె్టన్ పవన్ సెహ్రావత్ ఈ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు.
పవన్ కేవలం రెండు పాయింట్లు మాత్రమే సాధించాడు. మొత్తం 14 సార్లు రెయిడింగ్‌కు వెళ్లిన పవన్ ఒకసారి సఫలమై, మరోసారి బోనస్ పాయింట్ రాబట్టాడు. తొమ్మిదిసార్లు పాయింట్ సాధించకుండానే తిరిగి వచ్చాడు. టైటాన్స్ జట్టు మరో ప్లేయర్ సందీప్ ఐదు పాయింట్లు గెలిచాడు. మరోవైపు పుణేరి పల్టన్ తరఫున మోహిత్ గోయట్, అస్లమ్ ముస్తఫా చెలరేగిపోయారు.
మోహిత్ 13 పాయింట్లు, అస్లమ్ 8 పాయింట్లు స్కోరు చేశారు. గౌరవ్ ఖత్రీ (6), అభినేశ్ (5), మొహమ్మద్ రెజా (5) కూడా రాణించారు. మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ 48–41తో యూపీ యోధాస్‌పై గెలుపొందింది. యూపీ యోధాస్ కెప్టెన్ ప్రదీప్ నర్వాల్ 21 పాయింట్లతో అదరగొట్టినా తన జట్టును గెలిపించలేకపోయాడు.
చదవండి: సంజూ శాంసన్ భారీ సిక్సర్.. బంతి ఎక్కడ పడిందో తెలుసా? వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment