
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ జట్టుకు ఏడో పరాజయం ఎదురైంది. బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో టైటాన్స్ 33–36తో యూపీ యోధాస్ చేతిలో ఓటమి పాలైంది. స్టార్ రెయిడర్ విజయ్ 11 పాయింట్లతో సత్తా చాటినా... కీలక సమయాల్లో ఆధిక్యం కనబర్చిన యోధాస్ విజేతగా నిలిచింది.
ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో టైటాన్స్ 19 రెయిడ్ పాయింట్లు సాధించగా... యూపీ యోధాస్ 24 పాయింట్లతో ముందంజ వేసింది. యూపీ యోధాస్ ప్రధాన రెయిడర్ గగన్ నారంగ్ 15 పాయింట్లతో విజృంభించాడు. తాజా సీజన్‌లో 16 మ్యాచ్‌లాడిన టైటాన్స్ తొమ్మిందిట గెలిచింది. ఏడింటిలో ఓడింది.
49 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 39–32తో హరియాణా స్టీలర్స్‌ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో యూపీ యోధాస్ (రాత్రి 8 గంటలకు), జైపూర్ పింక్ పాంథర్స్‌తో యు ముంబా (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment