
పుణే: ప్రత్యర్థిని పట్టేయాలన్న టైటాన్స్ అత్యుత్సాహం జట్టుకు విజయాన్ని దూరం చేసింది. గెలవాల్సిన మ్యాచ్‌ను టైటిల్ తో సరిపెట్టుకుంది. శుక్రవారం జరిగిన టైటాన్స్, పట్నా పైరేట్స్ మ్యాచ్ 42–42తో ‘డ్రా’గా ముగిసింది. స్పష్టమైన ఆధిక్యాన్ని రెండు సార్లు చేజార్చుకున్న టైటాన్స్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. 17 పాయింట్లు సాధించిన పట్నా రైడర్ ప్రదీప్ నర్వాల్ జట్టుకు పరాభవాన్ని తప్పించాడు. ఏకంగా మూడు సూపర్ రైడ్‌లతో చెలరేగి జట్టును ఆదుకున్నాడు. టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ దేశాయ్ (12 పాయింట్లు), రజ్‌నీశ్ (10 పాయింట్లు) రాణించారు. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 42–38తో బెంగళూరు బుల్స్‌పై నెగ్గింది. నేటి మ్యాచ్‌ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్; యూపీ యోధతో తమిళ్ తలైవాస్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment