సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్‌లో చివరిదైన పన్నెండో స్థానంలో నిలిచిన తెలుగు టైటాన్స్ తొమ్మిదో సీజన్‌కు సిద్ధమైంది. ఈనెల ఏడో తేదీన బెంగళూరులో జరిగే తొలి మ్యాచ్‌లో మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. కొత్త ఆటగాళ్లు, కొత్త కోచ్‌తో తెలుగు టైటాన్స్ బరిలోకి దిగనుందని, ఈసారి మెరుగైన ప్రదర్శన చేస్తామని టీమ్ యజమానులు శ్రీనివాస్ శ్రీరామనేని, నేదురుమల్లి గౌతమ్ రెడ్డి, మహేశ్ కొల్లి విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలుగు టైటాన్స్‌కు కోచ్‌గా వెంకటేశ్ గౌడ్, కెప్టెన్‌గా రవీందర్ పహల్ వ్యవహరించనున్నారు. సిద్ధార్థ్ దేశాయ్, అంకిత్ బెనివాల్, మోనూ గోయట్, రజనీశ్, అభిషేక్ సింగ్, వినయ్, సుర్జీత్ సింగ్, విశాల్ భరద్వాజ్, పర్వేశ్, విజయ్ కుమార్, ఆదర్శ్, ప్రిన్స్, నితిన్, రవీందర్, మోహిత్, హనుమంతు, మొహమ్మద్ షిహాస్, పల్లా రామకృష్ణ, మోసిన్, హమీద్, అంకిత్, మోహిత్ పహల్, సుమిత్ జట్టులోని ఇతర సభ్యులు.
Comments
Please login to add a commentAdd a comment