పది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ ఎడిషన్‌కు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆగష్టు 15, 16 తేదీల్లో ప్లేయర్ల వేలం జరుగనుంది. ఈ నేపథ్యంలో పీకేఎల్‌లో భాగమైన పన్నెండు ఫ్రాంఛైజీలు.. అంతా కలిపి 88 మంది ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి.
అయితే, అనూహ్య రీతిలో ప్రదీప్ నర్వాల్, పవన్ షెరావత్, మణిందర్ సింగ్, ఫజల్ అట్రాచలీ, మొహమ్మద్ రెజా తదితర స్టార్ ప్లేయర్లు ఈసారి వేలంలో పాల్గొననుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా, వేలంలో ఆటగాళ్లను కొనేందుకు పర్సులో మిగిలి ఉన్న మొత్తం, వేలం ఆరంభ సమయం, లైవ్‌స్ట్రీమింగ్ ఎక్కడ తదితర వివరాలు మీకోసం..
పన్నెండు జట్లు ఇవే
తెలుగు టైటాన్స్, బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబాంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, హర్యానా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పాట్నా పైరేట్స్, పుణెరి పల్టన్, తమిళ్ తలైవాస్, యూ ముంబా, యూపీ యోధాస్.
రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా
తెలుగు టైటాన్స్
అంకిత్, ఓంకార్ నారాయణ్ పాటిల్, ప్రఫుల్ సుదమ్ జవారే, సంజీవి ఎస్, నీల్, శంకర్ భీమ్రాజ్ గడాయ్, అజిత్ పాండురంగ పవార్.
బెంగాల్ వారియర్స్
శ్రేయాస్ ఉమర్దండ్, ఆదిత్య ఎస్ షిండే, దీపక్ అర్జున్ షిండే, మహరుద్ర గార్జే, నీల్, విశ్వాస్ ఎస్, నితిన్ కుమార్.
బెంగళూరు బుల్స్
ఆదిత్య శంకర్ పవార్, అక్షిత్, అరుల్‌అనంతబాబు, ప్రతీక్, సౌరభ్ నందాల్, పొన్‌పార్తీబన్ సుబ్రమణియన్, సుశీల్, రోహిత్ కుమార్.
దబాంగ్ ఢిల్లీ
ఆశిష్, హిమ్మత్ అంతిల్, మనూ, యోగేశ్, నీల్, అన్షు మాలిక్, విక్రాంత్, నవీన్ కుమార్.
గుజరాత్ జెయింట్స్
నితిన్, ప్రతీక్ దహియా, రాకేశ్,బాలాజీ డి, జితేందర్ యాదవ్.
హర్యానా స్టీలర్స్
జయసూర్య ఎన్‌ఎస్, హర్దీప్, శివం అనిల్ పటారే, విశాల్ ఎస్ టాటే, జైదీప్, మోహిత్, వినయ్, రాహుల్ సేత్‌పాల్, ఘనశ్యామ్ రోకా మగర్.
జైపూర్ పింక్ పాంథర్స్
అభిజీత్ మాలిక్, అంకుశ్, అభిషేక్ కేఎస్, అర్జున్ దేశ్వాల్, రెజా మీరాఘెరి
పట్నా పైరైట్స్
అబినంద్ శుబాంశ్, కునాల్ మెహతా, సుధాకర్ ఎమ్, మనీశ్, అంకిత్, సందీప్ కుమార్.
పుణెరి పల్టన్
దదాసో శివాజీ పూజారి, నితిన్, తుషార్ దత్తాత్రేయ అధావడె, వైభవ్ బాలాసాహెబ్ కాంబ్లీ, ఆదిత్య తుషార్ షిండే, ఆకాశ్ సంతోశ్ షిండే, మోహిత్ గయత్, అస్లాం ముస్తఫా ఇనాందార్, పంకజ్ మోహితే, సంకేత్ సెహ్రావత్, అబినేశ్ నదరాజన్, గౌరవ్ ఖత్రీ.
తమిళ్ తలైవాస్
నితేశ్ కుమార్, నితిన్ సింగ్, రొనాక్, విశాల్ చహల్, నరేందర్, సాహిల్, మోహిత్, ఆశిష్, సాగర్, హిమాన్షు, ఎం. అభిషేక్, నీల్.
యూ ముంబా
బిట్టు, గోకులకన్నన్ ఎం, ముకిలన్ షణ్ముగం, సోంవీర్, శివం, అమీర్ మొహ్మద్ జఫార్దనేశ్, రింకూ.
యూపీ యోధాస్
గగన గౌడ హెచ్‌ఆర్, హితేశ్, శివం చౌదరి, సుమిత్, సురేందర్ గిల్, అశూ సింగ్, నీల్.
ఒక్కో జట్టులో ఎంత మంది?
కనీసం 18 నుంచి అత్యధిక 25 మంది ఆటగాళ్లు ఒక్కో జట్టులో ఉండవచ్చు. ఇప్పటికి 88 మందిని ఆయా ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్నాయి గనుక 212 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి.
ఎంత మంది విదేశీ ఆటగాళ్లు?
ఒక్కో జట్టులో కనీసం రెండు, అత్యధికంగా నలుగురు విదేశీ ప్లేయర్లు ఉండవచ్చు.
టీమ్ పర్సు వివరాలు
ఒక్కో ఫ్రాంఛైజీ రూ. 5 కోట్ల మేర పర్సు వాల్యూ కలిగి ఉంటుంది. అయితే, రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల కోసం చెల్లించిన మొత్తం పోగా.. మిగిలిన డబ్బుతో వేలంలో పాల్గొంటాయి.
సీజన్-11 వేలం నేపథ్యంలో ఫ్రాంఛైజీల పర్సులో మిగిలి ఉన్న మొత్తం
👉బెంగాల్ వారియర్స్'- రూ. 3.62 కోట్లు
👉బెంగళూరు బుల్స్- రూ. 3.02 కోట్లు
👉దబాంగ్ ఢిల్లీ- రూ. 2.66 కోట్లు
👉గుజరాత్ జెయింట్స్- రూ. 4.08 కోట్లు
👉హర్యానా స్టీలర్స్- రూ. 2.32 కోట్లు
👉జైపూర్ పింక్ పాంథర్స్- రూ. 2.29 కోట్లు
👉పట్నా పైరేట్స్- రూ. 3.59 కోట్లు
👉పుణెరి పల్టన్- రూ. 2.12 కోట్లు
👉తమిళ్ తలైవాస్- రూ. 2.57 కోట్లు
👉తెలుగు టైటాన్స్- రూ. 3.82 కోట్లు
👉యు ముంబా- 2.88 కోట్లు
👉యూపీ యోధాస్- 3.16 కోట్లు.
నాలుగు కేటగిరీలు
👉‘ఎ’ కేటగిరీలో ఉన్న ప్లేయర్ల కనీస ధర రూ. 30 లక్షలు
👉‘బి’ కేటగిరీలో ఉన్న వాళ్ల బేస్ ప్రైజ్ రూ. 20 లక్షలు.
👉‘సి’ కేటగిరీ ప్లేయర్లకు రూ.13 లక్షలు
👉‘డి’ కేటగిరీ ఆటగాళ్లకు రూ. 9 లక్షలు ప్రాథమిక ధర
👉ఈ సారి వేలంలో 500 మందికి పైగా ప్లేయర్లు పాల్గొననున్నారు.
ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే?
ఆగష్టు 15 రాత్రి ఏడు గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం(టీవీ). డిజిటల్ మీడియాలో డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం.
Comments
Please login to add a commentAdd a comment