తొలి అంచె పోటీలు హైదరాబాద్‌లో
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ అక్టోబరు 18వ తేదీన మొదలవుతుంది. మూడు నగరాల్లో ఈ టోర్నీని నిర్వహిస్తారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అక్టోబరు 18 నుంచి తొలి అంచె పోటీలు జరుగుతాయి. అనంతరం నవంబరు 10 నుంచి రెండో అంచె మ్యాచ్‌లకు నోయిడా నగరం ఆతిథ్యమిస్తుంది.
చివరి అంచె పోటీలు డిసెంబరు 3 నుంచి పుణేలో జరుగుతాయని... పూర్తి షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని పీకేఎల్ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి తెలిపారు. కాగా 2014లో ప్రొ కబడ్డీ లీగ్ మొదలైంది. ఇప్పటి వరకు 10 సీజన్లపాటు ఈ టోర్నీ జరిగింది. పుణేరి పల్టన్ జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.
తెలుగు టైటాన్స్ దారుణ వైఫల్యం
పట్నా పైరేట్స్ జట్టు అత్యధికంగా మూడుసార్లు విజేతగా నిలువగా... జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు రెండుసార్లు టైటిల్‌ను దక్కించుకుంది. బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబంగ్ ఢిల్లీ, యు ముంబా, పుణేరి పల్టన్ జట్లు ఒక్కోసారి చాంపియన్‌గా నిలిచాయి. తెలుగు టైటాన్స్ జట్టు రెండో సీజన్‌లో మూడో స్థానంలో, నాలుగో సీజన్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. గత మూడు సీజన్లలో తెలుగు టైటాన్స్ జట్టు చివరిదైన 12వ స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment