
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో గెలవాల్సిన మ్యాచ్‌ను ఓడిన టైటాన్స్ శుక్రవారం
రాంచీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో గెలవాల్సిన మ్యాచ్‌ను ఓడిన టైటాన్స్ శుక్రవారం పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరింత చెత్తగా ఆడింది. దీంతో 30–46 తేడాతో పరాజయం పాలైంది. ఈ సీజన్‌లో జట్టుకిది 11వ ఓటమి కావడం గమనార్హం. ప్రథమార్ధం ఆరంభంలో బాగానే ఆడినా ఆ తర్వాత ఆట గతి తప్పింది. దీంతో 16–23తో వెనకబడింది. ఆ తర్వాత కూడా పట్నా ఆటగాళ్లు సులువుగా కట్టడి చేయడంతో టైటాన్స్ ఓటమి ఖాయమైంది.
ప్రదీప్ నర్వాల్ 14 రైడింగ్ పాయింట్లు సాధించగా టైటాన్స్ నుంచి రాహుల్ చౌధరి 7 పాయింట్లు మాత్రమే సాధించాడు. మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 39–28 తేడాతో యు ముంబాపై నెగ్గింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్.. పట్నా పైరేట్స్‌తో యూపీ యోధ తలపడతాయి.