మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్‌  | Pro Kabaddi League 2024: Bengal Warriors Put Telugu Titans To The Sword In Massive 20-Point Victory - Sakshi
Sakshi News home page

Pro Kabaddi League 2024: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్‌ 

Published Sun, Feb 11 2024 9:59 AM | Last Updated on Sun, Feb 11 2024 12:14 PM

Bengal Warriors put Telugu Titans to the sword in massive 20-point victory - Sakshi

కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్‌లో తమ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ తెలుగు టైటాన్స్‌ మరో ఓటమిని మూటగట్టుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 55–35 స్కోరుతో టైటాన్స్‌పై విజయం సాధించింది.

తెలుగు జట్టు తరఫున మిలాద్‌ జబారి 9, ప్రఫుల్‌ జవారే 8, పవన్‌ సెహ్రావత్‌ 6 పాయింట్లు సాధించగా...బెంగాల్‌ ఆటగాళ్ళలో నితిన్‌ కుమార్‌ 13 పాయింట్లతో చెలరేగాడు. టైటాన్స్‌కు ఓవరాల్‌గా 19 మ్యాచ్‌లలో ఇది 17వ పరాజయం. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 44–23 స్కోరుతో యు ముంబాపై గెలుపొందింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement