
సాక్షి, విశాఖపట్నం: సొంతగడ్డపై చివరి మ్యాచ్‌ను తెలుగు టైటాన్స్ విజయంతో ముగించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 41–36తో పట్నా పైరేట్స్‌పై గెలిచింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 12 పాయింట్లతో చెలరేగగా... నీలేశ్ 9, మోసిన్ 5 పాయింట్లు సాధించారు. పట్నా పైరేట్స్ తరఫున ‘డుబ్కీ’కింగ్ ప్రదీప్ నర్వాల్ 12 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. జోన్ ‘బి’లో ఇప్పటివరకు 19 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ 8 మ్యాచ్‌ల్లో గెలిచి 50 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో పుణేరి పల్టన్, బెంగాల్ వారియర్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడనున్నాయి. వైజాగ్‌లో మ్యాచ్‌లు ముగియగా... శుక్రవారం నుంచి పోటీలు హరియాణాలోని పంచకులలో జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment