pro kabbadi
-
అదరగొట్టిన తెలుగు టైటాన్స్..
-
ఒకే ఫ్రేమ్‌లో ఐశ్వర్య రాయ్ కుటుంబం.. ఆ ఒక్కరు మాత్రం లేరు
బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వారి కుటుంబం నుంచి ఎన్నో ఊహాగానాలు వచ్చినా వారు మరింత రెట్టింపుతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా ముంబైలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కబడ్డీ మ్యాచ్‌కు జయ బచ్చన్ మినహా ఆ కుటుంబం మొత్తం హాజరయ్యారు. ముంబైలో జరిగిన ఈ కబడ్డీ మ్యాచ్‌లో ఐశ్వర్యరాయ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్ ఉన్నారు. వీరంతా అభిషేక్ బచ్చన్‌కు చెందిన జైపూర్ పింక్ పాంథర్స్ జట్టును ఉత్సాహపరిచేందుకు అక్కడికి వచ్చారు. ప్రొ కబడ్డీ లీగ్ (పికెఎల్) సీజన్ 10 మ్యాచ్‌లో ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న ఆ జట్టు యు ముంబాను ఓడించింది. ఆ మ్యాచ్‌లో సందడిగా కనిపించిన బచ్చన్ కుటుంబాన్ని స్టార్ స్పోర్ట్స్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో బచ్చన్ కుటుంబ సభ్యులు అందరూ జైపూర్ పింక్ పాంథర్స్ షర్టులు ధరించి వచ్చారు. యు ముంబా జట్టుతో జైపూర్ పింక్ పాంథర్స్ గట్టి పోటీనిచ్చింది. యు ముంబా జట్టును ఓడించడంతో, బచ్చన్ కుటుంబం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ కనిపించిన ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ జట్టు 2014 నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌లో పోటీ చేయడం ప్రారంభించింది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో యు ముంబా జట్టుపై జైపూర్ పింక్ పాంథర్స్ విజయం సాధించింది. అభిషేక్, ఐశ్వర్యల మధ్య మనస్పర్థలు వచ్చాయని వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం కొద్దిరోజులుగా బాలీవుడ్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే బచ్చన్ కుటుంబ సభ్యులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తమ పనుల్లో బిజీగా ఉన్నారు. పలు ప్రోగ్రామ్స్‌లో కలిసి కనిపిస్తూ రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అమితాబ్ ఇంటి నుంచి ఐశ్వర్య బయటకు వచ్చేసిందని దీనంతటికి కారణం తన అత్తగారు జయా బజ్చన్, అమితాబ్ బచ్చన్ అంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం బచ్చన్ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఒకే చోట కూర్చొని ఆనందంగా గడిపారు. ఇకనైన ఈ వార్తలకు చెక్ పడుతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. .@SrBachchan, @juniorbachchan & #AishwaryaRaiBachchan were all in attendance to watch the #JaipurPinkPanthers win their 1st game of the Mumbai leg! 🤩 Tune-in to #PUNvCHE in #PKLOnStarSports Tomorrow, 7:30 PM onwards | Star Sports Network#HarSaansMeinKabaddi pic.twitter.com/lUE0ksnU8r — Star Sports (@StarSportsIndia) January 6, 2024 -
యూపీ యోధా, తమిళ్ తలైవాస్ మ్యాచ్ ‘డ్రా’
పంచకుల (హరియాణా): ప్రొ కబడ్డీ లీగ్‌లో శనివారం జరిగిన రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. తొలుత యూపీ యోధా, తమిళ్ తలైవాస్ మధ్య పోరు 25–25తో ‘డ్రా’అయింది. యోధా తరఫున ప్రశాంత్ 12 పాయింట్లతో మెరిశాడు. యు ముంబా, జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ కూడా 35–35తో ‘టై’ అయింది. నేటి మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో యూపీ యోధా, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడనున్నాయి. -
జైపూర్ ఐదో గెలుపు
పంచకుల (హరియాణా): ప్రొ కబడ్డీ లీగ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ ఐదో విజయం నమోదు చేసుకుంది. జోన్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 36–23తో పుణేరి పల్టన్‌పై గెలిచింది. రైడింగ్‌లో ఇరు జట్లు సత్తా చాటినా... ట్యాక్లింగ్‌లో అదరగొట్టిన జైపూర్‌ను విజయం వరించింది. పింక్ పాంథర్స్ తరఫున దీపక్ హుడా, సునీల్ చెరో 8 పాయింట్లు సాధించారు. పుణేరి పల్టన్ తరఫున జీబీ మోరే, సందీప్ నర్వాల్ ఐదేసి పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 28–21తో తమిళ్ తలైవాస్ గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో యూపీ యోధాతో తమిళ్ తలైవాస్, జైపూర్ పింక్ పాంథర్స్‌తో యు ముంబా తలపడనున్నాయి. -
టైటాన్స్‌ను గెలిపించిన రాహుల్ చౌదరి
సాక్షి, విశాఖపట్నం: సొంతగడ్డపై చివరి మ్యాచ్‌ను తెలుగు టైటాన్స్ విజయంతో ముగించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 41–36తో పట్నా పైరేట్స్‌పై గెలిచింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 12 పాయింట్లతో చెలరేగగా... నీలేశ్ 9, మోసిన్ 5 పాయింట్లు సాధించారు. పట్నా పైరేట్స్ తరఫున ‘డుబ్కీ’కింగ్ ప్రదీప్ నర్వాల్ 12 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. జోన్ ‘బి’లో ఇప్పటివరకు 19 మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ 8 మ్యాచ్‌ల్లో గెలిచి 50 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో పుణేరి పల్టన్, బెంగాల్ వారియర్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడనున్నాయి. వైజాగ్‌లో మ్యాచ్‌లు ముగియగా... శుక్రవారం నుంచి పోటీలు హరియాణాలోని పంచకులలో జరుగనున్నాయి. -
జైపూర్‌కు ఝలక్
యు ముంబా 29-28తో విజయం ప్రొ కబడ్డీ లీగ్-2 ముంబై: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) రెండో సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్‌కు ఝలక్ తగిలింది. గతేడాది ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఆడిన యు ముంబా జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన ఈ తొలి మ్యాచ్.. నువ్వా నేనా అనే రీతిలో సాగగా చివరకు ముంబా జట్టు 29-28 తేడాతో నెగ్గింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఒక్కో పాయింట్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు పోటీపడ్డారు. అయితే కీలక సమయాల్లో ముంబై పాయింట్లు సాధిస్తూ జైపూర్పై ఒత్తిడి పెంచింది. 9-5తో ఆధిక్యంలో ఉన్న ఓ దశలో ముంబై ఏమరుపాటుతో ప్రత్యర్థి దూకుడు పెంచి 10-10తో సమంగా నిలిచింది. అయితే వెంటనే పుంజుకుని 16-15తో ముంబై తొలి భాగం ముగించింది. ఇక మరో ఐదు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా 25-25తో రెండు జట్లు సమంగా నిలిచాయి. ఈ దశలో షబీర్ బాపు ముంబైకి కీలక పాయింట్ అందించాడు. 29-26తో వెనుకబడిన తరుణంలో చివరి నిమిషంలో జైపూర్ రెండు పాయింట్లు సాధించినా అప్పటికే ఆలస్యమై పోయింది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 33-25 తేడాతో బెంగాల్ వారియర్స్‌పై నెగ్గింది. అంతకుముందు లీగ్ ప్రారంభంలో బాలీ వుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కపిల్‌దేవ్, ఆమిర్‌ఖాన్, రిషీ కపూర్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, జాన్ అబ్రహం తదితరులు హాజరయ్యారు. మరోవైపు ముంబై, పుణేలలో జరిగే మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ ఆటగాళ్లను దూరంగా ఉంచాలని నిర్వాహకులు నిర్ణయించారు. ముంబైలో ఉగ్రవాద దాడులను నిరసిస్తూ శివసేన కార్యకర్తలు ఆందోళన చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ఇండోర్‌లో జిలుగు వెలుగుల ప్రో కబడ్డీ