
పంచకుల (హరియాణా): ప్రొ కబడ్డీ లీగ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ ఐదో విజయం నమోదు చేసుకుంది. జోన్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 36–23తో పుణేరి పల్టన్‌పై గెలిచింది. రైడింగ్‌లో ఇరు జట్లు సత్తా చాటినా... ట్యాక్లింగ్‌లో అదరగొట్టిన జైపూర్‌ను విజయం వరించింది. పింక్ పాంథర్స్ తరఫున దీపక్ హుడా, సునీల్ చెరో 8 పాయింట్లు సాధించారు. పుణేరి పల్టన్ తరఫున జీబీ మోరే, సందీప్ నర్వాల్ ఐదేసి పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 28–21తో తమిళ్ తలైవాస్ గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో యూపీ యోధాతో తమిళ్ తలైవాస్, జైపూర్ పింక్ పాంథర్స్‌తో యు ముంబా తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment