Pooneri Palton
-
జైపూర్ ఐదో గెలుపు
పంచకుల (హరియాణా): ప్రొ కబడ్డీ లీగ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ ఐదో విజయం నమోదు చేసుకుంది. జోన్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 36–23తో పుణేరి పల్టన్‌పై గెలిచింది. రైడింగ్‌లో ఇరు జట్లు సత్తా చాటినా... ట్యాక్లింగ్‌లో అదరగొట్టిన జైపూర్‌ను విజయం వరించింది. పింక్ పాంథర్స్ తరఫున దీపక్ హుడా, సునీల్ చెరో 8 పాయింట్లు సాధించారు. పుణేరి పల్టన్ తరఫున జీబీ మోరే, సందీప్ నర్వాల్ ఐదేసి పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 28–21తో తమిళ్ తలైవాస్ గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో యూపీ యోధాతో తమిళ్ తలైవాస్, జైపూర్ పింక్ పాంథర్స్‌తో యు ముంబా తలపడనున్నాయి. -
పుణేరి చేతిలో హరియాణా చిత్తు
ప్రొ కబడ్డీ లీగ్ రాంచీ: ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో విజృంభించిన పుణేరి పల్టన్ 37–25 తేడాతో హరియాణా స్టీలర్స్‌పై ఘనవిజయం సాధించింది. రాజేశ్ మొండల్ 7 రైడింగ్ పాయింట్లతో ఆకట్టుకుని విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే హరియాణా రైడర్ సుర్జీత్ సింగ్ అత్యధికంగా 10 రైడింగ్ పాయింట్లు సాధించినా సహచరుల వైఫల్యంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. జోన్ ‘ఎ’లో రెండో స్థానంలో కొనసాగుతున్న హరియాణా స్టీలర్స్ ఆరంభంలో పుణేరికి గట్టి పోటీనే ఇచ్చింది. ఇరు జట్లు ఒక్కో పాయింట్ కోసం హోరాహోరీగా తలపడ్డాయి. ప్రథమార్ధం మరో నాలుగు నిమిషాల్లో ముగిసేవరకు హరియాణా 8–9తో గట్టి పోటీనే ఇచ్చింది. కానీ ఆఖర్లో పుంజుకున్న పుణేరి 16–10తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ద్వితీయార్ధంలో హరియాణా నుంచి ఏమాత్రం పోటీ ఎదురుకాకపోవడంతో చకచకా పాయింట్లు సాధించిన పుణెరి స్పష్టమైన ఆధిక్యంతో విజయాన్నందుకుంది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 36–32 తేడాతో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్; పట్నా పైరేట్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడతాయి.