పుణేరి చేతిలో హరియాణా చిత్తు | Puneri Paltan beat Haryana Steelers | Sakshi
Sakshi News home page

పుణేరి చేతిలో హరియాణా చిత్తు

Published Wed, Sep 20 2017 1:24 AM | Last Updated on Wed, Sep 20 2017 11:51 AM

పుణేరి చేతిలో హరియాణా చిత్తు

పుణేరి చేతిలో హరియాణా చిత్తు

ప్రొ కబడ్డీ లీగ్‌

రాంచీ: ప్రొ కబడ్డీ లీగ్‌ ఐదో సీజన్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో విజృంభించిన పుణేరి పల్టన్‌ 37–25 తేడాతో హరియాణా స్టీలర్స్‌పై ఘనవిజయం సాధించింది. రాజేశ్‌ మొండల్‌ 7 రైడింగ్‌ పాయింట్లతో ఆకట్టుకుని విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే హరియాణా రైడర్‌ సుర్జీత్‌ సింగ్‌ అత్యధికంగా 10 రైడింగ్‌ పాయింట్లు సాధించినా సహచరుల వైఫల్యంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. జోన్‌ ‘ఎ’లో రెండో స్థానంలో కొనసాగుతున్న హరియాణా స్టీలర్స్‌ ఆరంభంలో పుణేరికి గట్టి పోటీనే ఇచ్చింది.

ఇరు జట్లు ఒక్కో పాయింట్‌ కోసం హోరాహోరీగా తలపడ్డాయి. ప్రథమార్ధం మరో నాలుగు నిమిషాల్లో ముగిసేవరకు హరియాణా 8–9తో గట్టి పోటీనే ఇచ్చింది. కానీ ఆఖర్లో పుంజుకున్న పుణేరి 16–10తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ద్వితీయార్ధంలో హరియాణా నుంచి ఏమాత్రం పోటీ ఎదురుకాకపోవడంతో చకచకా పాయింట్లు సాధించిన పుణెరి స్పష్టమైన ఆధిక్యంతో విజయాన్నందుకుంది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 36–32 తేడాతో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌; పట్నా పైరేట్స్‌తో తమిళ్‌ తలైవాస్‌ తలపడతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement