
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. టోరీ్నలో నాలుగో మ్యాచ్ ఆడిన జట్టు వరుసగా నాలుగో ఓటమిని ఎదుర్కొంది. బుధవారం హోరాహోరీగా జరిగిన పోరులో తమిళ్ తలైవాస్ 38–36 స్కోరుతో టైటాన్స్‌పై విజయం సాధించింది.
టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్, రాబిన్ చౌదరి చెరో 7 పాయింట్లు సాధించారు. తలైవాస్ ఆటగాళ్లలో నరేందర్ 10, సాహిల్ 7 పాయింట్లతో జట్టు గెలిపించా రు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 32–30 తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment