
పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌లో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తలైవాస్ 38–27 స్కోరుతో జైపూర్ పింక్‌పాంథర్స్‌పై గెలుపొందింది. తమిళ్ జట్టు రెయిడర్లు నరేందర్ (13 పాయింట్లు), అజింక్యా పవార్ (6 పాయింట్లు) అదరగొట్టారు. జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ 9 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. హరియాణా స్టీలర్స్, పుణేరి పల్టాన్ జట్ల మధ్య జరిగిన పోరు 27–27తో టైగా ముగిసింది.
హరియాణా జట్టులో మన్‌జీత్ (8), మీతు శర్మ (8) రాణించారు. పుణేరి జట్టులో లమోహిత్ గోయత్ 17 సార్లు కూతకు వెళ్లి 11 పాయింట్లు సాధించాడు. మూడో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 34–29తో యూపీ యోధాస్‌ను ఓడించింది. పైరేట్స్‌లో సచిన్ (11), రోహిత్ (7) చక్కని ప్రదర్శన కనబరచగా, యోధాస్ జట్టులో స్టార్ రెయిడర్ ప్రదీప్ నర్వాల్ (12) రాణించాడు.
చదవండి: T20 WC 2022: 'రోహిత్, కోహ్లి కాదు.. అతడే టీమిండియా బెస్ట్ బ్యాటర్'
Comments
Please login to add a commentAdd a comment