తమిళ తలైవాస్‌పై గెలుపొందిన పింక్ పాంథర్స్ (PC: PKL X)
Pro Kabaddi League- పట్నా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో ప్లే ఆఫ్స్ దశకు అర్హత పొందిన తొలి జట్టుగా డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ నిలిచింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 42–27తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది.
ఈ టోర్నీలో పింక్ పాంథర్స్‌కిది 12వ విజయం కావడం విశేషం. 12 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో పింక్ పాంథర్స్ 71 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. తలైవాస్‌తో మ్యాచ్‌లో పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ అత్యధికంగా 13 పాయింట్లు స్కోరు చేశాడు.
అట్టడుగున తెలుగు టైటాన్స్
పట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 29–29తో ‘డ్రా’గా ముగిసింది. శుక్రవారం జరిగే మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో బెంగాల్ వారియర్స్; గుజరాత్ జెయింట్స్‌తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. ఈ జట్ల సంగతి ఇలా ఉంటే.. తెలుగు టైటాన్స్‌కు మాత్రం ఈ సీజన్ కూడా కలిసిరాలేదు. ఆడిన పదిహేడింట కేవలం రెండు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
Panthers first team through to the #PKLSeason10 playoffs 💥🤩
— ProKabaddi (@ProKabaddi) January 31, 2024
After some fiery action on the mat 🔥 Here’s how the standings look like after the final day of the Patna leg ⚡#ProKabaddiLeague #ProKabaddi #PKL #HarSaansMeinKabaddi #PATvBLR #JPPvCHE pic.twitter.com/t3zYwuCwl0
Comments
Please login to add a commentAdd a comment