
ముంబై: కూత కూతకు గెలుపు సమీకరణాలు మారిపోయాయి. ఫైనల్ మజా ఎలా ఉండాలని అభిమానులు కోరుకుంటారే అంతకు మించి హోరు జరిగింది. ఈ సారైనా టైటిల్ గెలవాలని పట్టుదలగా ఆడిన గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ గెలుపు ముంగిట బోల్తాపడింది. ఉత్కంఠ భరితంగా సాగిన ప్రొ కబడ్డీ ఆరో సీజన్ తుది పోరులో బెంగళూరు బుల్స్ విజేతగా అవతరించింది. గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 38-33 తేడాతో విజయం సాధించింది. తొలి అర్థభాగం ముగిసేసరికి ఆధిక్యంలో నిలిచిన గుజరాత్ రెండో భాగంలో తడబడింది. బెంగళూరు సారథి రోహిత్ ఫైనల్ పోరులో తడబడినా స్టార్ రైడర్ పవన్ మరోసారి తనదైన రీతిలో రెచ్చిపోయి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment