
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్‌లో పుణేరీ పల్టన్ ఆరో విజయం సొంతం చేసుకుంది. జోన్ ‘ఎ’లో భాగంగా బుధవారం జరిగిన ఉత్కంఠభరిత పోరు లో పుణేరీ పల్టన్ 31–27తో దబంగ్ ఢిల్లీపై గెలిచింది. పుణేరీ తరఫున జీబీ మోరె 5, దీపక్ దహియా 4 రైడ్ పాయింట్లతో సత్తాచాటగా... ట్యాక్లింగ్‌లో సందీప్ నర్వాల్ (4 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. ఇరు జట్లు పోరాడటంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది.
ఓ దశలో 8–10, 9–13తో వెనుకబడిన పుణేరీ పల్టన్... మోనూ ‘సూపర్ రైడ్’తో చెలరేగడంతో 13–13తో స్కోరు సమం చేసింది. ఇక అక్కడి నుంచి ఆధిక్యాన్ని కొనసాగిస్తూ చివరకు విజయం సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 43–41తో పట్నా పరేట్స్‌పై గెలిచింది. నేడు బెంగాల్ వారియర్స్‌తో పట్నా పైరేట్స్, యూపీ యోధాతో తమిళ్ తలైవాస్ తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment