PC: IPL Twitter
ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్ మెడలు వంచిన తొలి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. నిన్న (మే 23) జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో గుజరాత్‌ను తొలిసారి ఆలౌట్ చేయడం ద్వారా సీఎస్‌కే ఈ ఘనత సాధించింది. ఐపీఎల్‌లో గుజరాత్ ఇప్పటివరకు 31 మ్యాచ్‌లు ఆడగా, ఈ మ్యాచ్‌కు ముందు ఒక్కసారి కూడా ఆలౌట్ కాలేదు. ఆలౌట్ విషయంలో గుజరాత్ అన్ బీటన్ రికార్డును సీఎస్‌కే చెరిపివేసింది.
30 మ్యాచ్‌ల్లో ఎవరికీ సాధ్యం కాని పనిని సీఎస్‌కే చేసి చూపించడంతో నెట్టింట వారిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్.. తమ 30 మ్యాచ్‌ల ఐపీఎల్ ప్రస్థానంలో (ఈ మ్యాచ్‌కు ముందు వరకు) కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే 9 వికెట్లు కోల్పోయింది. అలాగే ఆ జట్టు ఛేదనలో కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో (నిన్నటి ఓటమితో) మాత్రమే ఓడింది. అందులో మూడు మ్యాచ్‌లు (ముంబై, ఢిల్లీ, సీఎస్‌కే) ఈ సీజన్‌లో ఓడినవే. హార్ధిక్ సేనకు ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో ఇది తొలి ఓటమి కావడం మరో విశేషం.
ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో సీఎస్‌కే సమష్టి ప్రదర్శనతో గుజరాత్‌ను 15 పరుగుల తేడాతో ఓడించింది. ఫలితంగా ఆ జట్టు 10వ సారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (44 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్), డెవాన్ కాన్వే (34 బంతుల్లో 40; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (38 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ రాణించలేదు.
Comments
Please login to add a commentAdd a comment