all out record
-
CSK VS GT: ఎవరి తరం కాలేదు.. సీఎస్కే చేసి చూపించింది..!
ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్ మెడలు వంచిన తొలి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. నిన్న (మే 23) జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో గుజరాత్‌ను తొలిసారి ఆలౌట్ చేయడం ద్వారా సీఎస్కే ఈ ఘనత సాధించింది. ఐపీఎల్లో గుజరాత్ ఇప్పటివరకు 31 మ్యాచ్‌లు ఆడగా, ఈ మ్యాచ్‌కు ముందు ఒక్కసారి కూడా ఆలౌట్ కాలేదు. ఆలౌట్ విషయంలో గుజరాత్ అన్ బీటన్ రికార్డును సీఎస్కే చెరిపివేసింది. 30 మ్యాచ్‌ల్లో ఎవరికీ సాధ్యం కాని పనిని సీఎస్కే చేసి చూపించడంతో నెట్టింట వారిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్.. తమ 30 మ్యాచ్‌ల ఐపీఎల్ ప్రస్థానంలో (ఈ మ్యాచ్‌కు ముందు వరకు) కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే 9 వికెట్లు కోల్పోయింది. అలాగే ఆ జట్టు ఛేదనలో కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో (నిన్నటి ఓటమితో) మాత్రమే ఓడింది. అందులో మూడు మ్యాచ్‌లు (ముంబై, ఢిల్లీ, సీఎస్కే) ఈ సీజన్లో ఓడినవే. హార్ధిక్ సేనకు ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో ఇది తొలి ఓటమి కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో సీఎస్కే సమష్టి ప్రదర్శనతో గుజరాత్‌ను 15 పరుగుల తేడాతో ఓడించింది. ఫలితంగా ఆ జట్టు 10వ సారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (44 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్), డెవాన్ కాన్వే (34 బంతుల్లో 40; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (38 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ రాణించలేదు. చదవండి: CSK VS GT: ధోని తొండాట.. మ్యాచ్ 4 నిమిషాలు ఆలస్యం -
6కే ఆలౌట్... ఇదీ క్రికెట్టే!
కిగలి సిటీ: ఓ వైపు పురుషుల వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ 17 సిక్సర్లతో కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేస్తే... మరోవైపు మహిళల అంతర్జాతీయ టి20లో 6 పరుగులకే ఆలౌటైన చెత్త రికార్డు మంగళవారం నమోదైంది. క్విబుక మహిళల టి20 టోర్నీలో మాలి జట్టు ఈ కొత్త చెత్త రికార్డును తమ పేర లిఖించుకుంది. రువాండతో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన మాలి మహిళల జట్టు 9 ఓవర్లలో 6 పరుగులు చేసి ఆలౌటైంది. మరో ఆసక్తికర విషయమేంటంటే ఓపెనర్ సమకె (1) చేసిన పరుగే టాప్ స్కోర్! ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పది మంది ‘జీరో’లే! ఒక్కరు మినహా అందరు 6, 7 బంతులాడి ఖాతా తెరవకుండానే ఔటైతే... కౌలిబెలీ మాత్రం అత్యధికంగా 12 బంతులాడి డకౌటైంది. ఇక మిగతా 5 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. 2 బైస్, మరో 2 లెగ్‌బైస్, ఒకటేమో వైడ్... ఇది మాలి ఇన్నింగ్స్ కథకమామిషు! ఈ చెత్త రికార్డును ఛేదించేందుకు బరిలోకి దిగిన రువాండ జట్టు 4 బంతులాడి 8 పరుగులు చేసి గెలిచింది. ఇదే ఏడాది జనవరిలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో చైనా నెలకొల్పిన చెత్త రికార్డు (14 ఆలౌట్)ను మాలి సవరించింది. -
'ఆలౌట్' రికార్డు ఆగింది!
సిడ్నీ: టీమిండియా 'ఆలౌట్' రికార్డుకు బ్రేక్ పడింది. వరల్డ్ కప్ లో వరుసగా ఏడు మ్యాచుల్లో ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేసిన భారత బౌలర్ల జోరుకు అడ్డుకట్టపడింది. సెమీస్ సమరంలో ఆస్ట్రేలియాను ఆలౌట్ చేయలేకపోయారు. టీమిండియా బౌలర్లను ఆసీస్ ఆటగాళ్లు దీటుగా ఎదుర్కొన్నారు. 3.1 ఓవర్ లో15 పరుగులకే తొలి వికెట్ పడగొట్టి జోరు మీదున్నట్టు కనిపించిన భారత బౌలర్లను స్మిత్, ఫించ్ జోడి పరీక్ష పెట్టింది. ఇండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని వీరు బ్యాటింగ్ సాగించారు. వీరిద్దరినీ అవుట్ చేసేందుకు ధోని సేన చాలా శ్రమించింది. ఎట్టకేలకు 34.1 ఓవర్ లో 232 పరుగుల వద్ద రెండో వికెట్ తీశారు. తర్వాత భారత బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టి ఆలౌట్ చేసేలా కనిపించారు. చివరకు ఏడు వికెట్లు మాత్రమే తీయగలిగారు.