'ఆలౌట్' రికార్డు ఆగింది!
సిడ్నీ: టీమిండియా 'ఆలౌట్' రికార్డుకు బ్రేక్ పడింది. వరల్డ్ కప్ లో వరుసగా ఏడు మ్యాచుల్లో ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేసిన భారత బౌలర్ల జోరుకు అడ్డుకట్టపడింది. సెమీస్ సమరంలో ఆస్ట్రేలియాను ఆలౌట్ చేయలేకపోయారు. టీమిండియా బౌలర్లను ఆసీస్ ఆటగాళ్లు దీటుగా ఎదుర్కొన్నారు.
3.1 ఓవర్ లో15 పరుగులకే తొలి వికెట్ పడగొట్టి జోరు మీదున్నట్టు కనిపించిన భారత బౌలర్లను స్మిత్, ఫించ్ జోడి పరీక్ష పెట్టింది. ఇండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని వీరు బ్యాటింగ్ సాగించారు. వీరిద్దరినీ అవుట్ చేసేందుకు ధోని సేన చాలా శ్రమించింది. ఎట్టకేలకు 34.1 ఓవర్ లో 232 పరుగుల వద్ద రెండో వికెట్ తీశారు. తర్వాత భారత బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టి ఆలౌట్ చేసేలా కనిపించారు. చివరకు ఏడు వికెట్లు మాత్రమే తీయగలిగారు.