ఐపీఎల్–2023లో హైదరాబాద్ టీమ్ సన్‌రైజర్స్ ఆట ముగిసింది. 2021, 2022లలో ‘ప్లే ఆఫ్స్’కు అర్హత సాధించలేకపోయిన జట్టు వరుసగా మూడో ఏడాదీ విఫల ప్రదర్శనతో ముందంజ వేసే అవకాశాలు కోల్పోయింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో తాజా ఓటమితో జట్టు అధికారికంగా రేసు నుంచి నిష్క్రమించింది. ఈ గెలుపుతో డిఫెండింగ్ చాంపియన్ టైటాన్స్ అందరికంటే ముందుగా ప్లే ఆఫ్స్ చేరడంతో పాటు టాప్–2లో చోటును ఖాయం చేసుకుంది.
అహ్మదాబాద్: ఐపీఎల్‌లో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు దూరమైంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 34 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (58 బంతుల్లో 101; 13 ఫోర్లు, 1 సిక్స్) ఐపీఎల్‌లో తన తొలి సెంచరీ సాధించగా, సాయి సుదర్శన్ (36 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వీరిద్దరు 84 బంతుల్లో 147 పరుగులు జోడించగా, భువనేశ్వర్ (5/30) ఐదు వికెట్లతో రాణించాడు.
గుజరాత్ జట్టు 40 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 8 వికెట్లు చేజార్చుకుంది. భువీ వేసిన ఆఖరి ఓవర్లోనే 4 వికెట్లు కోల్పోయింది. ఇందులో ఒక రనౌట్ కూడా ఉంది. అనంతరం సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 154 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 64; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా... షమీ, మోహిత్ శర్మ చెరో 4 వికెట్లు తీశారు.
క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమంలో భాగంగా గుజరాత్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో ‘లావెండర్’ రంగు జెర్సీలు ధరించారు. ఛేదనలో రైజర్స్ ఏమాత్రం పోరాటం కనబర్చలేకపోయింది. క్లాసెన్ మినహా ఇతర ఆటగాళ్లు కనీస స్థాయి ప్రదర్శన కూడా చూపలేదు. తొలి 6 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ జట్టు తర్వాతి మూడు ఓవర్లలో మరో మూడు వికెట్లు చేజార్చు కొని విజయంపై ఆశలు కోల్పోయింది.
స్కోరు వివరాలు
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) అభిషేక్ (బి) భువనేశ్వర్ 0; శుబ్‌మన్ గిల్ (సి) సమద్ (బి) భువనేశ్వర్ 101; సుదర్శన్ (సి) నటరాజన్ (బి) జాన్సెన్ 47; హార్దిక్ పాండ్యా (సి) త్రిపాఠి (బి) భువనేశ్వర్ 8; మిల్లర్ (సి) మార్క్‌రమ్ (బి) నటరాజన్ 7; తెవాటియా (సి) జాన్సెన్ (బి) ఫారుఖీ 3; షనక (నాటౌట్) 9; రషీద్ (సి) క్లాసెన్ (బి) భువనేశ్వర్ 0; నూర్ (రనౌట్) 0; షమీ (సి) జాన్సెన్ (బి) భువనేశ్వర్ 0; మోహిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–0, 2–147, 3–156, 4–169, 5–175, 6–186, 7–186, 8–186, 9–187. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–30–5, జాన్సెన్ 4–0– 39–1, ఫారుఖీ 3–0–31–1, నటరాజన్ 4–0– 34–1, మార్క్‌రమ్ 1–0–13–0, మయాంక్ మార్కండే 3–0–27–0, అభిషేక్ శర్మ 1–0–13–0.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అన్‌మోల్ (సి) రషీద్ (బి) షమీ 5; అభిషేక్ (సి) సాహా (బి) యశ్ 5; మార్క్‌రమ్ (సి) షనక (బి) షమీ 10; త్రిపాఠి (సి) తెవాటియా (బి) షమీ 1; క్లాసెన్ (సి) మిల్లర్ (బి) షమీ 64; సన్విర్ (సి) సుదర్శన్ (బి) మోహిత్ 7; సమద్ (సి) (సబ్) మావి (బి) మోహిత్ 4; జాన్సెన్ (సి) పాండ్యా (బి) మోహిత్ 3; భువనేశ్వర్ (సి) రషీద్ (బి) మోహిత్ 27; మార్కండే (నాటౌట్) 18; ఫారుఖీ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–6, 2–11, 3–12, 4–29, 5–45, 6–49, 7–59, 8–127, 9–147. బౌలింగ్: షమీ 4–0–21–4, యశ్ దయాళ్ 4–0–31–1, రషీద్ 4–0–28–0, మోహిత్ శర్మ 4–0–28–4, నూర్ 2.5–0–35–0, తెవాటియా 1.1–0–7–0.
ఐపీఎల్‌లో నేడు
లక్నో vs ముంబై (రాత్రి గం. 7:30 నుంచి)
స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment