Photo: IPL Twitter
ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ ఆడడం దాదాపు ఖరారైనట్లే. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని 77 పరుగుల భారీ తేడాతో ఓడించిన సీఎస్‌కే సీజన్‌లో 8వ విజయాన్ని అందుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో 12వ సారి ప్లేఆఫ్స్ ఆడనున్న ధోని సేన అత్యధికసార్లు ప్లేఆఫ్స్‌కు వెళ్లిన జట్టుగా చరిత్ర సృష్టించింది.
17 పాయింట్లతో సీఎస్‌కే గుజరాత్ టైటాన్స్‌తో మొదటి క్వాలిఫైయర్ ఆడడం దాదాపు ఖాయమే. సీఎస్‌కే క్వాలిఫైయర్ ఆడకుండా ఆపాలంటే లక్నో సూపర్ జెయింట్స్, కేకేఆర్‌పై 100+ పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఇది అసాధ్యమైనప్పటికి టి20 క్రికెట్ కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం
ఐపీఎల్‌లో ఆడిన 14 సీజన్లలో 12సార్లు ప్లేఆఫ్స్‌కు..
ఇక ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కే ప్లేఆఫ్ చేరడం ఇది 12వ సారి. 2008 ఆరంభ సీజన్ మొదలుకొని 2023 వరకు జరిగిన 16 సీజన్లలో 12సార్లు ప్లేఆఫ్ చేరడం అంటే మాటలు కాదు. ధోని లాంటి నాయకుడు జట్టులో ఉండడం.. నిలకడకు నిలువుటద్దంలా నిలిచింది సీఎస్‌కే.
మధ్యలో రెండు సీజన్లలో(2016,2017) సీఎస్‌కే బ్యాన్‌కు గురైన సంగతి తెలిసిందే. ఇక 2020, 2022లో రెండు సీజన్లు మాత్రమే దారుణంగా ఆడిన సీఎస్‌కే ఏడో స్థానానికి పరిమితమైంది. ఇది మినహా మిగతా అన్నిసార్లు ప్లేఆఫ్ చేరిన జట్టుగా నిలిచింది. ఇందులో నాలుగుసార్లు ఛాంపియన్‌గా(2010, 2011, 2018, 2021), ఇక 2008, 2012, 2013, 2015, 2019లో రన్నరప్‌గా నిలవడం విశేషం. 2009లో నాలుగోస్థానం, 2014లో మూడో స్థానానికి పరిమితమైంది.
A terrific victory in Delhi for the @ChennaiIPL 🙌
— IndianPremierLeague (@IPL) May 20, 2023
They confirm their qualification to the #TATAIPL 2023 Playoffs 😎
Scorecard ▶️ https://t.co/ESWjX1m8WD #TATAIPL | #DCvCSK pic.twitter.com/OOyfgTTqwu
CSK qualifies for the 12th time in 14 seasons of the IPL.
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 20, 2023
- The most consistent side under the leadership of MS Dhoni! pic.twitter.com/UKtIMwQdvY
Comments
Please login to add a commentAdd a comment