Courtesy: IPL Twitter
IPL 2022: ఐపీఎల్-2022 ప్లే ఆఫ్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మే 24న క్వాలిఫయర్–1 మ్యాచ్... మే 25న కోల్‌కతాలోనే ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతాయి. ఒక రోజు విరామం తర్వాత మే 27న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్–2 మ్యాచ్... మే 29న ఫైనల్ నిర్వహిస్తారు.
మరోవైపు ప్లే ఆఫ్ దశ మ్యాచ్‌లకు 100 శాతం మంది ప్రేక్షకులకు అనుమతి ఇవ్వనున్నామని బీసీసీఐ తెలిపింది. ఇక ఐపీఎల్ సీజన్ 15వ ఆసక్తికరంగా సాగుతోంది. ఐపీఎల్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ అదరగొడుతున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి, రెండు స్థానాల్లో గుజరాత్, లక్నో నిలిచాయి. ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్ సీఎస్‌కే, 5 సార్లు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఈసారి తీవ్రంగా నిరాశ పరిచాయి.
చదవండి: IPL 2022: లివింగ్‌స్టోన్ విధ్వంసం.. ఐపీఎల్ 2022లోనే భారీ సిక్సర్.. వైరల్
Comments
Please login to add a commentAdd a comment