PC: IPL Twitter
ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ (మే 18) మరో కీలక మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తప్పక గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఆర్సీబీ ఓడిందా.. ఢిల్లీ (అధికారికంగా ఔట్), సన్‌రైజర్స్, పంజాబ్, కేకేఆర్ (ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా లేనట్లే) బాటలోనే ప్లే ఆఫ్స్‌కు చేరకుండా లీగ్ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది.
నేటి మ్యాచ్‌లో ఆర్సీబీ.. ఎస్‌ఆర్‌హెచ్ చేతిలో ఓడినా మరో అవకాశం ఉంటుంది. అయితే మే 21న గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. అప్పటికీ ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుందని చెప్పలేని పరిస్థితి. రేపు (మే 19) జరుగబోయే మ్యాచ్‌లో రాజస్థాన్‌పై పంజాబ్, మే 20న జరిగే రెండు మ్యాచ్‌ల్లో ఢిల్లీపై సీఎస్‌కే, కేకేఆర్‌పై లక్నో, మే 21న (మధ్యాహ్నం) జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ముంబై ఓడితే అప్పుడు ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.
అప్పటికి కూడా నెట్ రన్‌రేట్ కీలకంగా మారుతుంది. గుజరాత్‌పై ఆర్సీబీ సాధారణ విజయం సాధించినా ముంబైతో సమానంగా ఇరు జట్ల ఖాతాలో 14 పాయింట్లు ఉంటాయి. అప్పుడు మెరుగైన రన్‌రేట్ కలిగిన జట్టు గుజరాత్ (18), సీఎస్‌కే (17), లక్నో (17)లతో పాటు ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ పంజాబ్‌పై రాజస్థాన్ గెలిచినా.. సన్‌రైజర్స్‌పై ముంబై గెలిచినా.. ఢిల్లీ చేతిలో సీఎస్‌కే, కేకేఆర్ చేతిలో లక్నో ఓడినా సమీకరణలన్నీ మారిపోతాయి. అప్పుడు 2, 3, 4 స్థానాల కోసం సీఎస్‌కే, లక్నో, ముంబై, ఆర్సీబీ, రాజస్థాన్ జట్లు పోటీపడాల్సి ఉంటుంది. నెగిటివ్ రన్‌రేట్ కారణంగా 12 పాయింట్లు ఉన్నప్పటికీ కేకేఆర్, పంజాబ్ జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించినట్లే.
చదవండి: చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్.. కేసు నమోదు! ఎందుకంటే?
Comments
Please login to add a commentAdd a comment