మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్ చివరి దశకు చేరింది. గ్రూప్ దశలో మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇదివరకే రెండు ప్లేఆఫ్స్ బెర్త్‌లు ఖరారైపోయాయి. ఇక మిగిలింది ఓ బెర్త్. ఈ బెర్త్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దాదాపుగా ఖరారు చేసుకుంది. ఏదో మహాద్భతం జరిగితే తప్ప ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరదు. ఇవాళ (మార్చి 12) ముంబై ఇండయన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడినా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.
అయితే భారీ తేడాతో ఓడితే మాత్రం సమీకరణలు మారిపోతాయి. ఇవాల్టి మ్యాచ్‌లో ఆర్సీబీ ముంబై చేతిలో 60 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడితే యూపీ వారియర్జ్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఆర్సీబీ తర్వాత యూపీ వారియర్జ్‌కు మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఛాన్స్ ఉందని అనుకోవడానికి వీల్లేదు. గుజరాత్ జెయింట్స్ తమ చివరాఖరి గ్రూప్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను కనీసం 57 పరుగుల తేడాతో ఓడిస్తే ఈ జట్టు కూడా ప్లేఆఫ్స్ బరిలో ఉంటుంది.
ఏ జట్టు అవకాశాలు ఎలా ఉన్నాయంటే..
- ఆర్సీబీ ముంబై ఇండియన్స్‌నూ గెలిస్తే దర్జాగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.
- ఆర్సీబీ ముంబై ఇండియన్స్ చేతిలో 60 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడితే మాత్రం యూపీ వారియర్జ్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.
- గుజరాత్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను 57 అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడించి, ఆర్సీబీ ముంబై ఇండియన్స్ చేతిలో 60 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడితే గుజరాత్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.
ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యే మూడో జట్టు మార్చి 15న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న జట్టుతో తలపడుతుంది. తదుపరి జరుగబోయే రెండు గ్రూప్ మ్యాచ్‌ల ఆధారంగా పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలు నిర్దారించబడతాయి.
ప్రస్తుతానికి రన్‌రేట్ ఆధారంగా ఢిల్లీ టాప్‌లో ఉంది. పాయింట్లు సమానంగా ఉన్నా ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచే జట్టుతో మార్చి 17న జరిగే అంతిమ సమరంలో అమీతుమీ తేల్చుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment